పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు విభాగాల వారీగా శనివారం ఫ్రెషర్స్ డేని జోరుగా .. హుషారుగా జరుపుకున్నారు . ‘ ఫ్రెషర్స్ డే అనేది మరుపురానిది . ఇది విద్యార్థి జీవితంలో కొత్త ప్రయాణానికి నాంది పలుకుతుంది . నూతన విద్యార్థులకు సాదర స్వాగతం పలికే రోజు . సీనియర్ , జూనియర్ విద్యార్థులంతా ఐక్యంగా జరుపుకునే వేడుక ‘ అంటూ గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ విద్యార్థులను ఉత్సాహపరిచారు . ఫ్రెషర్స్ పార్టీ అంటేనే , కలిసి ఉండే క్షణాలను ఆస్వాదించడం , క్యాంపస్లో భాగమై నూతన విద్యార్థులకు మంచి అనుభూతిని కలిగించడం అని స్పష్టీకరించారు .
సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఉల్లాసంగా , ఉత్సాహంగా సాగి విద్యార్థులలో జోష్ను నింపాయి . విద్యార్థినీ విద్యార్థుల కేరింతలతో ప్రాంగణమంతా మార్మోగిపోయింది . ఫ్రెషర్స్తో కలిసి సీనియర్ విద్యార్థులు అద్భుతమైన ర్యాంప్ వాక్ , పాటలు , నృత్యాలు , స్కిట్లు ప్రదర్శించారు . సంప్రదాయ దుస్తులలో చేసిన కూచిపూడి , భరతనాట్యం అందరి మన్ననలు చూరగొన్నాయి . చివరగా పసందెన విందుతో ఈ వేడుకలు విజయవంతంగా ముగిశాయి .
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…