ఐ కే పి సెంటర్ ను సందర్శించిన మాజీమంత్రి…
మనవార్తలు :
బీజేపీ నాయకులు మాజీ మంత్రీ బాబూ మోహన్ సంగారెడ్డి జిల్లా… చౌటకూర్ మండలo లోని కొర్పోల్ గ్రామం లో గల ఐకేపీ సెంటర్ నీ సందర్శించి, అక్కడ రైతులతో మాట్లాడి వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి కోసి ఐకేపీ సెంటర్ కు తెచ్చి 45 రోజులు అవుతున్నా ఇంకా ధాన్యం కొనటం లేదు అని , వర్షం లో తడిసి ముద్దయి మొలకలు వస్తున్నాయని రైతులు తమ ఆవేదనను బాబూ మోహన్ తో చెప్పు కున్నారు. బాబూ మోహన్ అక్కడి అధికారులతో మాట్లాడి మూడు రోజులలో సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని యెడల తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచచరించారు , ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, కొర్పొల్ సీనియర్ నాయకులు బాగన్నా గౌడ్, బచుగుడెం ప్రవీణ్ రెడ్డి, డబ్బి రామకృష్ణ , వడ్ల సతీష్, వడ్ల సుధాకర్ , భాను ప్రకాష్ , వెంకట్, చిన్న , దేవేందర్, సింగూర్ విష్ణూ జోగేపెట్ సాయి, నవీన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.