పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పటాన్‌చెరు పట్టణంలోని గాంధీ థీమ్ పార్క్ లో గల మహాత్మా గాంధీ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ స్థానిక నాయకులతో కలిసి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస పద్ధతుల ద్వారా దేశానికి స్వతంత్రం తీసుకు వచ్చిన మహోన్నత నాయకుడు మాత్మ గాంధీ అని కొనియాడారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు. నేటి తరాలకు మహాత్మా గాంధీ చరితను తెలియజేసే విధంగా ప్రతి గ్రామపంచాయతీ ఆవరణలో విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన కూడళ్లలో సైతం ఏర్పాటు చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్రా బిక్షపతి, వెంకటేష్, హమీద్, నాయకులు, పట్టణ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.
రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…
ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…
శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…