KALICHARAN

జీవ వైవిధ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి…

Hyderabad

జీవ వైవిధ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి…

-జీవ వైవిధ్య మండలి కార్యదర్శి కాళీ చరణ్

హైదరాబాాద్:
జీవ వైవిధ్యంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి కార్యదర్శి కాళీ చరణ్‌ అన్నారు. ప్రతి ఏడాది మే 22 వతేదీ అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని.. కరోనా కారణంగా ఈ సారి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ జీవ వైద్య మండలి, సాగర్‌ సాప్ట్‌వేర్‌ సొల్యూషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను  హైదరాబాద్ లాక్డికపూల్‌లోని అరణ్య భవన్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీవ వైవిద్య మండలి కార్యదర్శి కాళీ చరణ్‌, సాగర్‌ సాప్ట్‌వేర్‌ సొల్యూషన్‌ సీఇఓ  జోగి రితేష్ వెంకట్, అధికారులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. “
మనం పరిష్కారంలో భాగస్వామ్యులం” అనే అంశంతో ఈ ఏడాది పోటీలు నిర్వహిస్తున్నట్లు కాళీచరణ్‌ తెలిపారు. జీవి వైవిద్యం అనేది వాతావరణం, ఆరోగ్య సమస్యలు, ఆహారం, నీటి భద్రత, స్థిరమైన జీవనోనపాధికి ప్రకృతి ఆధారిత పరిష్కారాలు తిరిగి నిర్మించగల పునాది అని అన్నారు. జూనియర్‌, సీనియర్‌ అనే రెండో విభాగాల్లో 9 అంశాలతో ఈ పోటీలు ఆన్‌లైన్‌ ద్వారా నిర్వస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో పెయింటింగ్‌, ఫోటోగ్రఫీ, వ్యాసరచన, ప్రసంగం, నృత్యం, కార్టూన్‌ డిజైన్‌, క్విజ్‌, ఫ్యాన్సీడ్రెస్‌ ఇలా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మే 20 తేదీ లోపు www.tsepbr.org/pbr_eventfacebook.com/tsbiodiversity అనే వైబ్‌సైట్‌ ద్వారా పేర్లును నమోదు చేసుకోవాలని కాళీ చరణ్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *