రాష్ట్రానికి చెందిన ప్రముఖ బాక్సర్ నిక్కత్ జరీన్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిక్కత్ జరీన్ ప్రతిభను గుర్తించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఆఫీసర్ గా ఉద్యోగం కల్పించింది. హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత ను నిక్కత్ జరీన్ తల్లిదండ్రులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నిక్కత్ జరీన్ ను అభినందించిన ఎమ్మెల్సీ కవిత.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎంతో కష్టపడి బాక్సింగ్ లో ప్రపంచస్థాయికి ఎదిగిన నిక్కత్ జరీన్ యువతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. అంతేకాదు నిక్కత్ జరీన్ ను క్రీడలవైపు ప్రోత్సాహించిన తల్లిదండ్రులు పర్వీన్, జమీల్ లను సైతం ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా,సాట్స్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…