Districts

కన్నుల పండువగా ఈస్టర్ వేడుకలు

మనవార్తలు ,పటాన్ చెరు:

దేశ వ్యాప్తంగా ప్రజలు ఆదివారం నాడు ఈస్టర్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు  మండలం అశోకనగర్ వేడుక హాల్లోనూ ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని క్రైస్తవ దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా ఆయా క్రైస్తవ దేవాలయాలలో పునరుత్థానుడైన ఏసుక్రీస్తు గూర్చి భక్తి గీతాలు ఆలపించగా, బోధకులు శుభ సందేశాన్ని అందించారు. యేసుక్రీస్తు ప్రభువు మానవాళి పాపాలను సిలువ మీద మోసి మరణించి,తిరిగి లేచి 2022సవంత్సరాలైయ్యిందని, మరియు ఈ రోజు జరిగిన అటువంటి ఆ కార్యాన్ని జ్ఞాపకం చేస్తూ,పునరుద్ధరడుగా చరిత్రలో మరణమును జయించిన వ్యక్తిగా యేసు క్రీస్తు వారు మాత్రమే ఉన్నారని తెలిపారు.

అలయాల్లో జరిగే ఈస్టర్ వేడుకలకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో క్రైస్తవ ఆలయాలకు చేరుకుని ప్రార్థలు చేశారు. ఈస్టర్ పండుగకు ముందు 40 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాసం ఆచరించడం వందలాది ఏళ్లుగా ఆచారంగా వస్తోంది  ఆ ఉపవాసాలు కూడా ఈస్టర్ పర్వదినం రోజు ముగుస్తాయి అని అని బోధకులు తెలిపారు .ఈ పండుగను పురస్కరించుకుని అన్ని చర్చీలను అందంగా తీర్చిదిద్దారు. శాంతి ,ప్రేమ,కరుణ అలాగే క్షమించే తత్వాన్ని మనo అందరం ఆచరించాలని ,ఆయన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని అకాక్షించారు.ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని మహిమ గలా దేవుడిని స్తుతిస్తూ ఆరాధించారు.ఈస్టర్ ను పురస్కరించుకుని ప్రధాని మోడీ సహా ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

4 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

4 days ago