Districts

వంశీకృష్ణకు డాక్టరేట్..

మనవార్తలు ,పటాన్ చెరు:

భారతదేశంలో వినియోగదారుల ధరల సూచిక ద్రవ్యోల్బణంపై ప్రయోగాధార అధ్యయనం – సమయ శ్రేణి విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని అప్లయిడ్ మాథమెడిక్స్ విభాగం పరిశోధక విద్యార్థి టి . వంశీకృష్ణను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ని గణితశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు .

ఈ అధ్యయనం హార్బ్ ఘాతాంకాన్ని నిర్ణయించడానికి వివిధ పద్ధతులను ఉపయోగించిందని , వినియోగదారుల ధరల సూచిక – భారత ద్రవ్యోల్బణం దీర్ఘ – శ్రేణి ఆధారపడే స్వభావాన్ని నిర్ధారించినట్టు ఆయన తెలిపారు . మనదేశంలో వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణానికి అత్యుత్తమ సూచన నమూనాను నిర్ణయించడంపై కూడా దృష్టి సారించినట్టు తెలిపారు . ఘాతాంక సులువైన పద్ధతి , సరళ యాదృచ్చిక పద్ధతులు , కృ త్రిమ న్యూరల్ నెట్వర్క్ పద్ధతులతో మూల్యాంకనం చేసినట్టు పేర్కొన్నారు .

భారతదేశంలో వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణానికి ARFISMA నమూనా ఉత్తమమైనదిగి గుర్తించినట్టు తెలియజేశారు . వంశీకృష్ణ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , | హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రెజా , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Ramesh

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

21 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

23 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

3 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

3 days ago