మనవార్తలు ,పటాన్ చెరు:
ఇంకోనెల్ 718 మిశ్రమం , దాని ప్రక్రియ – పారామితులు విశ్లేషణ ‘ , పై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.కిరణ్ కుమార్ను డాక్టరేట్ వరించింది . శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ వెంకట్రామయ్య ఈ పరిశోధనను పర్యవేక్షించినట్టు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . ఈ సిద్ధాంత వ్యాసంలో , ABAQUS ఉపయోగించి అనుకరణ , ప్రయోగాత్మక పరీక్షలు , WASPAS పద్ధతిని ఉపయోగించి సరెన్డ పారామితులను గుర్తించడం ద్వారా ఇంకోనెల్ 718 పోలికలో అత్యంత ప్రభావవంతమైన పారామితులను గుర్తించడానికి అధ్యయనం చేసినట్టు తెలిపారు . కిరణ్ కుమార్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి పీహెచీ పట్టా సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , డెరైక్టర్ – ఇంజనీరింగ్ ప్రొఫెసర్ వీకే మిట్టల్ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్ , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…