Telangana

పారిశ్రామిక వాడలో మత్స్యకారుల్ని ప్రత్యేకంగా పరిగణించండి

ప్రతి ఒక్కరికీ సొసైటీ సభ్యత్వాలు కల్పించండి..

సొసైటీ సభ్యత్వాలు లేక పథకాల లబ్ధి కోల్పోతున్న మత్స్యకారులు

పాశమైలారం పరిశ్రమల కాలుష్యం వల్ల ఇస్నాపూర్ చెరువులు విషపూరితంగా మారి మత్స్యకారులకు జీవనోపాధి సమస్య

మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లిన నీలం మధు ముదిరాజ్

సానుకూలంగా స్పందించి విచారణ జరిపి నివేదిక ఇవ్వవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చిన మంత్రి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఇస్నాపూర్ గ్రామ మత్స్యకారులను ప్రత్యేకంగా పరిగణించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ కోరారు.గురువారం ఇస్నాపూర్ మత్స్యకార సోదరులతో కలిసి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ఎన్విరాన్మెంట్ శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖ గారిని హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసి మత్స్యకారుల సమస్య పై వినతి పత్రం అందించారు. అనంతరం ఈనెల 8వ తేదీన జిన్నారం మండలం కోడకంచి ఆదినారాయణ స్వామి జాతర మరియు ఈనెల 21వ తేదీన ఇస్నాపూర్ పెద్దమ్మతల్లి విగ్రహప్రతిష్ఠ కార్యక్రమాలకు హాజరుకావాలని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ పాశమైలారం పారిశ్రామిక వాడలో వెలువడుతున్న కాలుష్యం కారణంగా ఈ ప్రాంతంలో చెరువులు విషపూరితంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్ధ జలాలు చెరువులో కలవడం వల్ల ఇప్పటికే ఈ ప్రాంతంలో చాలా చెరువులలో చేప పిల్లలు మృత్యువాత పడుతున్నాయన్నారు. ఏ ఏ పరిశ్రమల ద్వారా చెరువులకు నష్టం జరుగుతుందన్న విషయాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా విచారణ జరిపి నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని చెరువుల్లో కాలుష్యం వల్ల చేపల పెంపకానికి అనువుగా లేకపోవడంతో ఇక్కడ మత్స్యకార సభ్యులకు సొసైటీలో సభ్యత్వం కల్పించే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన వాపోయారు. దీంతో ఇక్కడ మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలలో అర్హత సాధించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాశమైలారం పారిశ్రామికవాడలో నెలకొన్న ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇస్నాపూర్ మత్స్యకారులను ప్రత్యేకంగా గుర్తించి జిల్లా మత్స్యకార సహకార సంఘంలో సభ్యులుగా చేర్చుకోవాలని మరియు పరిశ్రమల నుంచి ప్రతి సంవత్సరం నష్ట పరిహారం ఇప్పించాలని ఆయన మంత్రిని కోరారు.

ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన మంత్రి కొండా సురేఖ సంబంధిత విజ్ఞప్తి పత్రంపై వెంటనే సంతకం చేసి పీసీబీ అధికారులకు విచారణ జరిపి నివేదిక ఇవ్వవలసిందిగా ఆదేశాలిచ్చారు, పారిశ్రామిక వాడలోనీ మత్స్యకారులకు న్యాయం జరిగే విధంగా శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిన్నారం బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దాసరి శ్రీకాంత్ రెడ్డి, జిన్నారం, గుమ్మడిదల మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ, నర్సింగ్ రావు, ప్రతాప్ రెడ్డి,మాణిక్ రావు, నారబోయిన శ్రీనివాస్, వీర్నాల సత్యనారాయణ, సుంకర బోయిన మహేష్,కొడకంచి ఆలయ అర్చకులు, ఇస్నాపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మన్నే రాఘవేందర్,ఉళ్ళ శంకర్, ప్యాట నర్సింలు,యాదగిరి, పెంటయ్య, గోపాల్,రాజు, సోములు, మనోహర్, దశరథ్,రవి తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్..

ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు వెల్లివిరియాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్‌చెరులో అద్భుత ప్రగతి.. పటాన్‌చెరు ,మనవార్తలు…

1 hour ago

108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గర్భిణీ ని ఆసుప్రతికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికమై 108 అంబులె‌న్స్‌లో ప్రసవించింది. పూర్తి…

1 hour ago

వేముకుంట మహాశక్తి లలితా పోచమ్మ ఆలయంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : వేముకుంట గౌతమినగర్‌లోని శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో ఆదివారం…

1 hour ago

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న కంజర్ల కృష్ణమూర్తి

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : పటాన్‌చెరు నియోజకవర్గంలో గల భారతీనగర్‌ డివిజన్‌లో నిర్వహించిన సుమారు 19 దేవి శరన్నవరాత్రి…

1 hour ago

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

21 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

1 day ago