Telangana

కాలనీల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

బీరంగూడ సిద్ధార్థ కాలనీ, ప్రణీత్ కౌంటి మిత్ర విహార్ కాలనీలలో పర్యటన.

4700 గజాలలో నూతన పార్క్ ఏర్పాటుకు హామీ

కాలనీ వాసులతో సమావేశం సమస్యల పరిష్కారానికి హామీ

ఎస్ ఐ ఆర్ లో ప్రతి ఓటరు పాల్గొనాలని విజ్ఞప్తి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ :

కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని.. సత్వరమే వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రతి రోజు ఉదయం వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి నియోజకవర్గంలోని గ్రామాలు, మున్సిపాలిటీలు, డివిజన్ల పరిధిలోని కాలనీలలో నేరుగా ప్రజలతో సమావేశమై  వారి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ వాటి పరిష్కారానికి నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. తాజాగా శనివారం ఉదయం బీరంగూడ డివిజన్ పరిధిలోని సిద్ధార్థ కాలనీ, ప్రణీత్ కౌంటీ మిత్రవిహార్ కాలనీలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో సమావేశమై.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రీన్ మెడోస్ కాలనీ, మిత్ర విహార కాలనీలలో గల 4745 గజాల స్థలంలో అధునాతన సౌకర్యాలతో పార్కు నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఓపెన్ జిమ్, సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలంటే తప్పనిసరిగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో పాల్గొని  స్థానికంగానే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. స్వయంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ కాలనీలో పర్యటించి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడం ఇవ్వడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో అమీన్పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, డిఈ వెంకటరమణ, విద్యుత్ శాఖ ఏడిఈ సంజయ్, మాజీ ప్రజా ప్రతినిధులు కృష్ణ, మల్లేష్, సీనియర్ నాయకులు కృష్ణ, గోపాల్, జగదీష్, తులసి రెడ్డి, శ్రీకాంత్, ఆయా కాలనీల ప్రజలు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago