పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని కెంపు కార్యాలయంలో సీఎం కప్ 2024 క్రీడా పోటీలపై నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థాయిల అధికారులతో ఆయన సమావేశమయ్యారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ నుండి రాష్ట్ర స్థాయి వరకు అథ్లెటిక్స్, ఫుట్ బాల్, వాలీ బాల్, కబడ్డీ, కోకో, యోగ తదితర అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. గ్రామీణ, మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జట్టులను ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుందని తెలిపారు. క్రీడలపై ఆసక్తి కలిగిన ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అండర్ 14, అండర్ 18, సీనియర్ స్థాయిలో క్రీడా పోటీలు జరుగుతాయని తెలిపారు. డిసెంబర్ 7, 8 తేదీలలో గ్రామపంచాయతీ స్థాయిలో, డిసెంబర్ 10, 11, 12 తేదీలలో మండల మరియు మున్సిపల్ స్థాయిలో క్రీడా పోటీలు జరుగుతాయని తెలిపారు. క్రీడా పోటీలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో లోపాలు లేకుండా ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు..
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…