మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్.సి.సి. క్యాడెట్లు, సిబ్బంది 2026 అక్టోబరు 1న (గురువారం) రుద్రారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్)లో ‘ఒక గంట, అంతా కలిసి’ అనే సామూహిక పరిశుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహించారు.పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, సుస్థిరమైన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యత గురించి పాఠశాల విద్యార్థులు, స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పరిశుభ్రత, పౌర బాధ్యత, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.గీతం ఎన్.సి.సి. క్యాడెట్లు, సిబ్బందిని రుద్రారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వాగతించి, పరిశుభ్రత, బాధ్యతాయుతమైన పౌర పద్ధతులను ప్రోత్సహించడంలో విద్యార్థులను భాగస్వాములను చేయడానికి వారు చేసిన ప్రయత్నాలను అభినందించారు.క్రీడా విభాగం కోచ్ లు, సిబ్బంది సహకారంతో, గీతం, హైదరాబాదు ఎన్.సి.సి. యూనిట్ సమన్వయకర్త లెఫ్టినెంట్ అజయ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసి, పర్యవేక్షించారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి సామూహిక చర్య, సమాజ భాగస్వామ్యం అత్యవసరం అనే సందేశాన్ని పునరుద్ఘాటిస్తూ, ఎన్.సి.సి. క్యాడెట్లు స్వచ్ఛతా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు.
రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…
ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…
శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…