మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :
బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో 2024-25 ఆస్థి పన్ను వసూలు రికార్డు స్థాయిలో వసూలైన సందర్బంగా జిహెచ్ఎంసి రెవెన్యూ విభాగానికి (30 సర్కిళ్లకు) సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా చందానగర్ సర్కిల్-21 నాలుగవ స్థానం వచ్చినందున చందానగర్ సర్కిల్ రెవెన్యూ విభాగన్ని సన్మానించారు.ఈ సందర్బంగా చందానగర్ సర్కిల్ ఉప కమీషనర్ పి. మోహన్ రెడ్డి మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 109.54 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లు తెలిపారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, టాక్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు మొత్తం బృందం సమిష్టి కృషి వల్ల ఈ ఘనత సాధించగలిగామని తెలిపారు.
చందానగర్ రెవిన్యూ విభాగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమం లొ సర్కిల్ రెవెన్యూ విభాగం ఏఎంసీలు, టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.ఎర్లీ బర్డ్ స్కీం ద్వారా ఆస్తి పన్ను ఏప్రిల్ 30వ తేదీ లోగా చెల్లిస్తే 5 శాతం రాయితీ పొందే అవకాశం ఉందని, ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎర్లీ బర్డ్ స్క్రీం అందుబాటులో ఉందని తెలిపారు. కేవలం 2025-26 ఆర్థిక సంవత్సర ఆస్తి పన్నుకు మాత్రమే ఎర్లీ బర్డ్ స్కీం వర్తింస్తుందని, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలపై ఎర్లీ బర్డ్ స్కీం వర్తించదని ఉప కమీషనర్ పేర్కొన్నారు.
శనివారం, ఆదివారం, సోమవారం మరియు ఏప్రిల్ నెలలోని అన్ని సెలవు రోజులలో బిల్ కలెక్టర్లు అందుబాటులో ఉంటారని, సర్కిల్ ఆఫీస్ సిటిజన్ సర్వీస్ సెంటర్ కూడా అందుబాటులో ఉంటుందని, ఫోన్ పే, గూగుల్ పే, క్రెడిట్ కార్డ్, మీ సేవా సెంటర్ల లొ ఆస్థి పన్ను చెల్లిoచుకోవచ్చని, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చందానగర్ సర్కిల్ ప్రజలకు ఉప కమిషనర్ మోహన్ రెడ్డి కోరారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…