Telangana

బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ- నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ తొలి భూపోరాట వీరవనిత, నిజాం రజాకార్ల అరాచకాలకు, నిరంకుశత్వానికి, బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన ఉద్యమ కాగడా చాకలి ఐలమ్మ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ లో ఉన్న ఐలమ్మ కాంస్య విగ్రహం వద్ద పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో చిట్యాల ఐలమ్మ పాత్ర వెలకట్టలేనిదన్నారు.బడుగు జీవుల అస్థిత్వాన్ని పరిరక్షించడానికి బందుకులు పట్టి సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు. ఆమె స్పూర్తితో మనమంతా ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో రాష్ట్రంలోనే అతి పెద్ద కాంస్య విగ్రహాన్ని చిట్కుల్ గ్రామంలో ప్రతిష్టించామని ఆయన గుర్తు చేశారు. ఆమె స్పూర్తితో సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి, రాజకీయ హక్కులు,ఉద్యోగ అవకాశాల కోసమే సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు గాను తెలంగాణ అసెంబ్లీలో రెండు బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదింపజేసింది అని అన్నారు, ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి చాకలి వెంకటేష్, సత్తయ్య, బాబు, కిషోర్, రజక సోదరులు, మాజీ పీఏ సీఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, ఆంజనేయులు, అశోక్, లింగం, లక్ష్మణ్, ప్రవీణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago