మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :
నగరంలో నవరాత్రి సందడి మొదలుకానుంది. హైదరాబాద్ మోడల్స్ , రాఘవి మీడియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10వ సీజన్ సెలబ్రిటీ దాండియా నైట్స్ 2026, అక్టోబర్ 9 నుంచి 20వ తేదీ వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఐఎస్‌బీ రోడ్ లో గల ఫ్లిప్‌సైడ్ అడ్వెంచర్ పార్క్ వేదికగా జరగనుంది.12 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో సంప్రదాయ దాండియా, సంగీతం, నృత్యం, వినోదం, సెలబ్రిటీల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కుటుంబాలు, యువత, సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, ఫ్యాషన్ మోడల్స్‌తో పాటు వినోద రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.ఈ సందర్భంగా ఫ్లిప్‌సైడ్ అడ్వెంచర్ పార్క్‌లో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ మోడల్స్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు వంశీ పల్లె, టాలీవుడ్ నటి, నేపథ్య గాయని సాయి కీర్తన స్వర్గం, యాంకర్ వైష్ణవి, రాఘవి మీడియా వ్యవస్థాపకులు మధుబాబుతో పాటు ఫ్లిప్‌సైడ్ అడ్వెంచర్ పార్క్ మేనేజ్‌మెంట్ సభ్యులు కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాండియా నైట్స్‌కు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలను వెల్లడించారు.అనంతరం వంశీ పల్లె మాట్లాడుతూ ఈ ఏడాది వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. లైవ్ బ్యాండ్స్, గర్బా పాటలు, సంప్రదాయ, ఢోల్ తడ్కా ప్రదర్శనలు, ప్రత్యేక థీమ్ అలంకరణలు, ప్రతిరోజూ సెలబ్రిటీల సందడి వంటి కార్యక్రమాలతో కొనసాగుతాయన్నారు. కుటుంబాలతో పాటు యువతకు కూడా ఈ వేడుకలు ప్రత్యేక అనుభూతిని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు .
రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…
ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…
శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…