యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేపట్టాలి…
– బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్
పటాన్ చెరు:
రైతు తాను పండించిన పంటను అమ్మడానికి మార్కెట్ తీసుకువెళ్లగా 15 రోజులు గడిచిన కొనుగోలు చేయకపోవడం దారుణమని బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ అన్నారు. సోమవారం తెలంగాణ రైతు గోస పై బిజెపి పోరు దీక్ష లో భాగంగా పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ కాలనీ తన నివాసంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా అదే రేటుకి కొనుగోలు చేయాలని, అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేపట్టాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు రైతుబంధు డబ్బులు వెంటనే వారి ఖాతాలో జమ చేయాలన్నారు. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కొనే సమయంలో క్వింటాలుకు ఆరు నుండి ఏడు కిలోల తాళ్ల పేరుతో తరుగు తీయడం సరికాదన్నారు.