పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ ప్రజల ఆత్మ ప్రతీక బీఆర్ఎస్ పార్టీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహ సమీపంలో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ..ఒక్కడితో మొదలైన బి ఆర్ ఎస్ ప్రస్థానం, ఉదృతమై ఉప్పెనగా మారి స్వరాష్ట్ర కలను సాకారం చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణను.. దశాబ్ది కాలంలో దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత బిఆర్ఎస్ కి దక్కిందన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల సభ్యత్వం బి ఆర్ ఎస్ కు ఉందన్నారు. ప్రతి కార్యకర్త కు 2 లక్షల రూపాయల రూపాయల ఉచిత ప్రమాద భీమా అందించడంతో పాటు, కష్టసుఖాల్లో అందగా ఉంటున్నామని తెలిపారు.కాంగ్రెస్ పాలనలో రైతులు, అన్నివర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. నేడు మరోసారి ప్రజల పక్షాన ప్రజా ఉద్యమం చేసేందుకు బిఆర్ఎస్ పార్టీ సంసిద్ధమైందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…