Telangana

వేద సంస్కృతి పరిరక్షణలో బ్రాహ్మణుల పాత్ర కీలకం

చతుర్వేద సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్తక సభ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ భవనంలో నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు–10వ చతుర్వేద సదస్సులో భాగంగా గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి పటాన్‌చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వేద శాస్త్ర పండితులు, బ్రాహ్మణోత్తముల సమక్షంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని, వేద పండితుల ఆశీర్వాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, వేద సంప్రదాయాలను తరతరాలకు అందించడంలో బ్రాహ్మణ సమాజం విశిష్టమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. వేదాలు, శాస్త్రాలు, ఆధ్యాత్మిక విలువలను పరిరక్షిస్తూ సమాజానికి మార్గనిర్దేశం చేస్తున్న వేద పండితుల సేవలు ఎంతో గౌరవనీయమైనవని పేర్కొన్నారు.

సమాజంలో నైతిక విలువలు, ఆధ్యాత్మిక చైతన్యం, సాంస్కృతిక వారసత్వం మరింత బలోపేతం కావాలంటే వేద సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వేదాలు కేవలం ఆధ్యాత్మిక జ్ఞానానికి మాత్రమే కాకుండా, మానవతా విలువలు, క్రమశిక్షణ, సమాజ శ్రేయస్సుకు మార్గదర్శకాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలోనూ ఈ సమావేశాలకు తాము ఆతిథ్యం ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. పేద బ్రాహ్మణులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతోపాటు సొంత నిధులను సైతం అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో బ్రాహ్మణ సంక్షేమ సంఘం నిర్మించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

చతుర్వేద సదస్సు వంటి కార్యక్రమాలు వేద సంప్రదాయాలను యువతకు చేరువ చేయడంతో పాటు, మన ప్రాచీన జ్ఞాన సంపదపై అవగాహన పెంపొందించేందుకు దోహదపడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వాసుదేవరావు, రామచంద్రాపురం మండల కార్యదర్శి చంద్రశేఖర్ జోషి, సంగారెడ్డి జిల్లా సభ్యులు వామనభట్ల ప్రకాశ శర్మ తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్ధక సభ్యులు, వేద పండితులు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ప్రతినిధులు, నిర్వాహకులు, భక్తులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

16 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

19 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

21 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

21 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

21 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago