BLACK FOUNGS

క‌రోనా రోగుల‌కు బ్లాక్  ఫంగ‌స్ ముప్పు డాక్టర్ మేఘనాథ్

Hyderabad

క‌రోనా రోగుల‌కు బ్లాక్  ఫంగ‌స్ ముప్పు డాక్టర్ మేఘనాథ్

హైద‌రాబాద్

కొవిడ్ సెకండ్ వేవ్ ద‌డ పుట్టస్తొంది . యావ‌త్ దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క‌రోనా కొత్తవేరియంట్లు ప్ర‌జ‌ల‌ను కంగారుపెడుతున్నా యి. ఇవ‌న్నీ ఒక ఎత్తయితే ప్రస్తుతం బ్లాక్  ఫంగ‌స్ ఇన్ ఫెక్ష‌న్ ప్రజలను మ‌రింతగా భ‌య‌పెడుతంది. రోగ‌నిరోధ‌క శ‌క్తి తక్కువ ఉన్న  వారిలో  ప్ర‌వేశించి ప్రాణాలను బ‌లితీసుకుంటోంది . బ్లాక్ ఫంగస్ ను మ్యూకార్ మైకోసిస్ అని కూడా అంటారు .సాధార‌ణంగా ప్రతి ఏటా పది కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చేవి . కోవిద్ సెకండ్ వేవ్ కారణంగా వందలాది మందికి బ్లాక్ ఫంగస్ సోకుతోంది. వాతావరణంలో దాదాపు అన్ని చోట్ల మ్యూకార్ మైకోసిస్ ఉంటుంది.
మనం పీల్చే గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని డాక్టర్ మేఘనాథ్ తెలిపారు . మన పీల్చే గాలి ద్వారా శరీరంలోకి వెళ్ళినా…ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఈ ఫంగస్ ను ఎదుర్కొంటుందన్నారు. ఒక వేళ రోగనిరోధన శక్తి తక్కువగా ఉంటే బ్లాక్ ఫంగస్ తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు . మధుమేహం, అస్తమా, అవయవ మార్పిడి చేయించుకున్న రోగులకు ఈ బ్లాక్ ఫంగస్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని మేఘనాథ్ తెలిపారు .
గాలి  ద్వారా ముక్కులోకి ప్రవేశించి మ్యూకార్ మైకోసిస్ …అక్కడి నుంచి కన్ను, పై దవడ, మెదడుకు వ్యాపిస్తుందన్నారు . మెదడుకు చేరేలోగా  చికిత్స చేయించుకోకుంటే ప్రాణాలకు ముప్పు ఉంటుందన్నారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిందన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *