మనవార్తలు , పటాన్ చెరు:
బీసీల అభ్యున్నతి బీజేపి తోనే సాధ్యంమని ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు అలె భాస్కర్ అన్నారు బుధవారం ఇస్నాపూర్ లోని స్కేర్ ఇన్ హోటల్ లో ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు బిట్ల మహేష్ అధ్వర్యంలోభారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అలె భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో కేసీఆర్ కుటుంబపాలన జరుగుతుందని అన్నారు బీసీల అభ్యున్నతి బీజేపి తోనే సాధ్యం అన్నారు.
నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా దక్కిందని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే చేసిన టీఆర్‌ఎస్ సర్కారు వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీలను అణిచివేస్తున్నారని, బీసీల సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని అలె భాస్కర్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు అలె భాస్కర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు నరెందర్ రెడ్డి, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నందనం దివాకర్,రాష్ట్ర కార్యదర్శి సురెందర్, ప్రచార కార్యదర్శి నర్సింగ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…