Telangana

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు పూర్వ వైభ‌వం తీసుకువ‌చ్చేందుకు త‌మ‌వంతు కృషి చేస్తాం – బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,తెల్లాపూర్

_ విద్యా భారతి పాఠశాలలో అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌ది నిర్మాణం కోసం ఐదు ల‌క్ష‌ల విరాళం అందించిన గ‌డీల శ్రీకాంత్ గౌడ్

ప్రభుత్వ పాఠశాలల‌ను ప్రైవేటు స్కూళ్ళ‌కు ధీటుగా తీర్చిదిద్దేందుకు త‌మ వంతు కృషి చేస్తాన‌ని పటాన్ చెరు మాజీ జెడ్పిటిసి, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతుల కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయ‌న తెలిపారు .సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ, నాగులపల్లి గ్రామంలో విద్యా భారతి పాఠశాలను గ‌తంలో ఆయ‌న ప‌రిశీలించారు. పాఠ‌శాల‌లో అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌ది నిర్మాణం కోసం గడిల శ్రీకాంత్ గౌడ్ ఐదు ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు.తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను అభివృద్ది చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమిత‌మైంద‌ని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ విమ‌ర్శించారు.

ఇటీవ‌ల తాను పటాన్ చెరువు మండల పరిధిలోని ముత్తంగి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాన‌ని  అక్క‌డ క‌నీస‌వ‌స‌తులు క‌రువ‌య్యాయ‌ని తెలిపారు. ప్ర‌భుత్వం పేరుకే మన ఊరు, మన బడి కార్యక్రమం అంటూ గొప్ప‌లు చెబుతుంద‌ని క్షేత్ర స్థాయిలో మాత్రం ఎలాంటి ప‌నులు చేప‌ట్ట‌లేద‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌భుత్వం పాఠ‌శాల‌లు శిథిలావ‌స్థ‌కు చేరుకున్నాయ‌ని క‌నీస మౌళిక స‌దుపాయాలు క‌ల్పించ‌లేద‌న్నారు.పాఠశాలలు ప్రారంభం అయ్యి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థుల‌కు పుస్తకాలు అందించ‌లేద‌న్నారు. దీనిని బట్టి విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుందన్నారు. డిజిటల్ పాఠాలు కేవలం డిజిటల్ ప్రకటనలకే పరిమితం అయ్యాయ‌ని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వ పాఠశాలలో దాతల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షుడు శంకర్ ,తెల్లాపూర్ కౌన్సిలర్ శంషాబాద్ రాజు ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ మహేందర్, పటాన్ చెరు మండల్ అధ్యక్షుడు ఈశ్వరయ్య, ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవేందర్ గౌడ్, ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ హనుమంతరావు ,మాజీ బీజేవైఎం జిల్లా నాయకులు రాంబాబు, పటాన్చెరు మండల్ ఓ బి సి అధ్యక్షుడు నరేందర్ గౌడ్, ఇతర బిజెపి నాయకులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago