మనవార్తలు , శేరిలింగంపల్లి :
బీజేపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హాఫీజ్ పెట్ డివిజన్ లో గల ఆల్విన్ కాలని లోని తన ఇంట్లోని తన గదిలోకి వెళ్లి నన్ను డిష్ట్రబ్ చేయొద్దు పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటి టిఫిన్ తీసుకెళ్లిన పి ఏ సురేష్ డోర్ కొట్టగా తీయకపోవడంతో కుటుంబ సభ్యుల సాయంతో కిటికీలోంచి చూడగా సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుని కన్పించడంతో డోర్ బద్దలు కొట్టి కిందకు దింపన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మదీనా గూడలోని శ్రీకర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, స్నేహితులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకొన్నారు.
చిన్నప్పటి నుండి ఆర్ ఎస్ ఎస్, ఏబీవీపీ వంటి సంస్థల్లో పనిచేసి, అంచెలంచెలుగా ఎదిగి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా ఉన్నాడు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంచి గుర్తింపు చెందిన వ్యక్తిగా అందరి మన్ననలు పొందారు. కరోనా విపత్తు సమయంలో వెలాది మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి అందరి మన్ననలు పొందారు.ఎవరు ఏ సమయంలో ఫోన్ చేసినా వెళ్లి వారి సమస్యలు తెలుసుకునేవారు.పేదల పక్షాన పోరాడే వ్యక్తి అకాల మరణం పట్ల శేరిలింగంపల్లి నియోజకవర్గo ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…