మహమ్మారి సోకిన వారికి మెరుగైన వైద్యం….
– ఎమ్మెల్సీ కవిత
– కల్వరి టెంపుల్ లో కోవిడ్ ఐసోలేషన్ వార్డు ప్రారంభం
మనవార్తలు, మియాపూర్ :
హైదరాబాద్ మియాపూర్ లో కల్వరి టెంపుల్ లో ఏర్పాటు చేసిన 300 పడకల ఐసోలేషన్ వార్డును ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తో కలసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కరోనా మహమ్మారి బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కల్వరి టెంపుల్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ వార్డు రోగులకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.
ఆపన్న సమయంలో అండగా నిలిచేందుకు ఎల్లప్పుడు ముందుంటామని కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు డాక్టర్ సతీశ్ కుమార్ అన్నారు. కొవిడ్ రోగుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లో దాదాపు 300 పడకలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇందులో యాభై పడకలకు ఆక్సిజన్ సరఫరా ఉంటుందని చెప్పారు.కరోనాతో చికిత్స తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆహారం, మందులు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. కరోనా రోగితో పాటు అతనికి సహాయకులుగా ఉన్న వారికి కూడా వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కేంద్రంలో దాదాపు 12 మంది వైద్యులు, 20 మంది నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు అందుబాటులో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాస్ తదితరులు లు పాల్గొన్నారు.