విద్యార్థులందరూ ప్రమోట్….

విద్యార్థులందరూ ప్రమోట్…. హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1 నుండి 9 వ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేసింది. కొవిడ్ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే వారిని పైతరగతులకు ప్రమోట్ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. విద్యాసంస్థలకు రేపట్నుంచి మే నెలాఖరు వరకు వేసవి సెలవులను కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ 2021-22 విద్యాసంవత్సరంలో పైతరగతులు చదివేలా ప్రమోట్ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు ఇది […]

Continue Reading

రెండో రోజు సాగిన అక్రమకట్టడాల కూల్చివేతలు…

రెండో రోజు సాగిన అక్రమకట్టడాల కూల్చివేతలు… పటాన్ చెరు: పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో రెండోరోజు అక్రమకట్టడాల కూల్చివేతలు కొనసాగాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎల్పీవో సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం అక్రమకట్టడాల కూల్చివేతలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఇంద్రేశం గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషోర్ ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగాయి. మొత్తం గుర్తించిన 11లో నాలుగు అక్రమ నిర్మాణాలు కూల్చివేశామని, మిగతా వాటిని రెండు ,మూడు రోజుల్లో […]

Continue Reading

గీతం స్కాలర్ పార్థసారథికి డాక్టరేట్….

గీతం స్కాలర్ పార్థసారథికి డాక్టరేట్… పటాన్ చెరు:. నూతన సమీకృత మార్గాల ప్రణాళిక , ప్రధాన రహదారులపై రద్దీ నియంత్రణ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీజ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం పరిశోధక విద్యార్థి పి.పార్థసారథిని డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ కె.మంజునాథాచారి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో […]

Continue Reading

సంచరిస్తున్న ఎలుగుబంటి….

 సంచరిస్తున్న ఎలుగుబంటి…. సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా… పుల్కల్ మండలం ఇసోజిపేట బొమ్మారెడ్డి గూడెం గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. ఎలుగుబంటి సంచారంతో రైతులు, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని ఫారెస్ట్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకొని తమకు రక్షణ కల్పించాలని రైతులు విన్నవిస్తున్నారు.

Continue Reading

పనుల్లో వేగం పెంచాలి….

పనుల్లో వేగం పెంచాలి…. – కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పటాన్ చెరు: డివిజన్ లో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. సోమవారం డివిజన్ పరిధిలోని కటిక బస్తి లో మంజూరైన సిసి రోడ్లు ,నూతన డ్రైనేజీ లైను పనులు మందకొడిగా సాగుతున్న విషయాన్ని గమనించిన కార్పొరేటర్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి జరుగుతున్న పనులను పరిశీలించి పనులలో వేగం పెంచేలా  చూడాలని […]

Continue Reading

పండ్లు మగ్గబెట్టే మిక్చర్‌ ఎన్‌రైప్‌ ను ఆవిష్కరించిన హోంమంత్రి

 మగ్గబెట్టే మిక్చర్‌ ఎన్‌రైప్‌ ను ఆవిష్కరించిన హోంమంత్రి – పండ్లను సహజసిద్ధంగా మగ్గబెట్టే మిక్చర్‌ ‘ఎన్‌రైప్‌’ ఆవిష్కరణ – చైనా విషరసాయనాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదన్న హోంమంత్రి హైదరాబాద్: సీజనల్ పండ్లను సహజసిద్ధంగా మగ్గబెట్టే మిక్చర్‌ ‘ఎన్‌రైప్‌’ ను రాష్ట్ర హోంమంత్రి మమమూద్ అలీ ఆవిష్కరించారు. హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో  హోంమంత్రి హమూద్ అలీ తో పాటు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీభాయి, టీఎస్ ఆగ్రోస్ ఎండీ కె.రాములు ఎన్ రైప్ ను […]

Continue Reading

జిటో ఆధ్వర్యంలో కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం…

  జిటో ఆధ్వర్యంలో కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం… హైదరాబాద్: ‌కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలతో కూడిన కోవిద్ కేర్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లెమన్ ట్రీ హోటల్ లో వంద పడకల తో ఈ కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు జిటో హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ కుషల్ కంకరియా తెలిపారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ […]

Continue Reading

పరిమళించిన మానవత్వం….

పరిమళించిన మానవత్వం ….  పటాన్ చెరు: 72 ఏళ్లు వృద్ధురాలు రామచంద్రాపురంలో ఓ ఆశ్రమంలో ఉంటుంది . వృదురాలికి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆశ్ర మం నిర్వాహకులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కోవిడ్ టెస్టు చేయించుకొని , నెగిటివ్ వస్తే ఆశ్ర మానికి రావాలని , పాజిటీవ్ వస్తే రావొద్దని చెప్పి పంపారు. దీంతో ఆమె పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి కోవిడ్ టెస్టు చేయించుకోవడానికి శనివారం రాత్రి 9 గంటలకు వచ్చి కుర్చీలో కూర్చుంది . ఆపై […]

Continue Reading

280 కిలోల గంజాయి పట్టివేత…

280 కిలోల గంజాయి పట్టివేత… – ఒక కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం – ఇద్దరూ రిమాండ్ పటాన్ చెరు:  ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల నుంచి జహీరాబాద్​కు తరలిస్తున్న  గంజాయిని ముత్తంగి టోల్​గేట్​ వద్ద మెదక్ డివిజన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. 280 కిలోల గంజాయి, ఓకారును సీజ్​చేశారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా…. జహీరాబాద్ మండలం గోవింద్​పూర్ తండాకు చెందిన బానోతు తులసీరామ్, నాల్కల్ మండలం రామతీర్థకు చెందిన […]

Continue Reading

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం – చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పటాన్ చెరు: మానవసేవయే మాధవసేవ అని, వేసవికాలంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు శ్రీ భగవాన్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పటాన్ చెరు బస్టాండ్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రశంసించారు. ఆదివారం ఉదయం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి చలివేంద్రాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సత్య సాయి బాబా సేవా […]

Continue Reading