గణేష్ గడ్డ దేవస్థానంలో ఓ అర్చకుడి కరోనా పాజిటివ్ …

గణేష్ గడ్డ దేవస్థానంలో ఓ అర్చకుడి కరోనా పాజిటివ్ … -అర్జిత సేవలు నిలిపివేత పటాన్‌చెరు: పటాన్ చెరు మండల పరిధిలోని గణేష్ గడ్డ దేవస్థానంలో ఓ అర్చకుడికి కరోనా పాజిటివ్ రావడంతో సోమవారం నుండి అర్జిత సేవలు నిలిపివేసినట్లు సమాచారం.ఈ విషయం పై ఆలయ ఈఓ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు . అయితే ఓ అర్చకుడి కరోనా పాజిటివ్ రావడంతో మిగిలిన అర్చకులు భయంలో పడ్డారు . ఎక్కడ వారు కూడ కరోనా […]

Continue Reading

ధాన్యం ఎండబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి…

ధాన్యం ఎండబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి… – జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు పటాన్ చెరు: రైతులు ధాన్యం అమ్మడానికి తీసుకొని వచ్చే ముందు ఎండబెట్టి తేమశాతం 17 వచ్చిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు అన్నారు. సోమవారం పటాన్ చెరు మండల పరిధిలోని లక్డారం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా తేమ […]

Continue Reading

రంజాన్ కానుకలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే…

రంజాన్ కానుకలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే… పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణంలోని చిన్న మసీదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, లియకత్ అలీ, అజ్మత్, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే…

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే… – ప్రారంభమైన కోవిడ్ వైద్యసేవలు – అందుబాటులోకి ఆక్సిజన్ పడకలు – ఆక్సిజన్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పటాన్ చెరు: పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు ప్రారంభమైనట్లు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇందుకు అనుగుణంగా 70 ఆక్సిజన్ సదుపాయం గల పడకలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం వైద్యులు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. […]

Continue Reading
TAX

పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్…

పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్… హైదరాబాద్: ఇంకా ఐటీ రిటర్న్స్ చెయ్యలేదా…? మరేం పరవాలేదు. ఈ మార్చి 31 తో ముగిసిన 2020-21 రిటర్న్ దాఖలు గడువును మే 31 వరకు పెంచడం జరిగింది. దీనితో మీరు ఆలస్యం అయినా చింతించకర్లేదు. కేంద్రం తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ఈ మార్చి 31 తో ముగిసిన 2020-21 రిటర్న్ దాఖలు గడువును మే 31 వరకు పెంచుతూ […]

Continue Reading
Nomula bhagath, TRS, Telangana, Telugu news

TRS : సాగర్ లో టీఆర్ఎస్ ఘన విజయం…

సాగర్ లో టీఆర్ఎస్ ఘన విజయం…. నల్గొండ జిల్లా… TRS : నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్(TRS) పార్టీ సత్తా చాటింది. ఎగ్టిట్ పోల్స్ అంచనాలు కంటే మిన్నగా మంచి మెజార్టీతో ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నోముల భగత్.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై 18 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 25 రౌండ్లలో కౌంటింగ్ జరగగా.. రెండు రౌండ్ల మినహా అన్ని రౌండ్లలోనూ […]

Continue Reading

హైదరాబాద్ లో రెచ్చిపోయిన ఆకతాయిలు..

హైదరాబాద్ లో రెచ్చిపోయిన ఆకతాయిలు.. హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌ నందినగర్‌లో మరోసారి ఆకతాయిలు రెచ్చిపోయారు. అకారణంగా ఇద్దరు యువకులపై దాడికి పాల్పడ్డారు. ఇదేంటని అడిగేందుకు వెళ్లిన వారి స్నేహితులపై రాడ్లు, కర్రలతో దాడి చేశారు. దుండగుల దాడిలో కొరియోగ్రాఫర్‌తో పాటు ఆర్ట్ డైరెక్టర్‌లకు గాయాలయ్యాయి. మరో ముగ్గురు కూడా గాయపడ్డారు. గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 20 మంది దాడిలో పాల్గొన్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా నందినగర్ గ్రౌండ్స్‌లో […]

Continue Reading

మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ బర్తరఫ్..

మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ బర్తరఫ్.. హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సూచన మేరకు రాష్ట్ర మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్‌ చేస్తూ గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని గవర్నర్‌ కార్యాలయం వెల్లడించింది. రైతుల ఆరోపణలు, కలెక్టర్‌ నివేదికను పరిగణలోకి తీసుకుని ఈటలను సీఎం మంత్రివర్గం నుండి తొలగించారు. నిన్న(శనివారం)నే ఈటలను ఆరోగ్యశాఖ నుండి తొలగించిన విషయం తెలిసిందే.

Continue Reading

యువజన సమాఖ్య ఉపాధ్యాక్షుడి గా నర్సింలు ముదిరాజ్…..

తెలంగాణ రాష్ట్ర యువజన సమాఖ్య ఉపాధ్యాక్షుడి గా నర్సింలు ముదిరాజ్ నియామకం హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ యువజన సమాఖ్య ఉపాధ్యక్షుడి గా సీనియర్ జర్నలిస్ట్, మెదక్ జిల్లా, రేగోడ్ మండలo ప్యారారం గ్రామానికి చెందిన తెనుగు నర్సింలు ముదిరాజ్ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ తెలిపారు. ఉన్నతమైన చదువులు చదివిన వ్యక్తిగా జర్నలిస్టుగా, నికార్సైన వార్తలు రాస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ రాష్ట్రంలో ముదిరాజుల పై జరుగుతున్న అన్యాయాలు […]

Continue Reading

కరోనా నేపథ్యంలో జూపార్కులు మూసివేత….

కరోనా నేపథ్యంలో జూపార్కులు మూసివేత…. – అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హైదరాబాద్: కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని జూ పార్క్ లు, పులుల అభయారణ్యంలు, జాతీయ ఉద్యాన వనాలను మూసివేయనున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. మంత్రి సూచనల మేరకు […]

Continue Reading