కాంగ్రెస్ పార్టీ నాయకుల పై దాడులు, అక్రమ కేసులు ఆపాలి…
– ఈ నెల 7న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష
పటాన్ చెరు:
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల మీద దాడులు అక్రమ కేసులు ఆపాలని సర్పంచ్ లు. ఎంపీటీసీ లకు నిధులు కేటాయించాలని మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు.
రెండు రోజుల క్రితం జరిగిన అమీన్ పూర్ మండల సర్వసభ్య సమావేశంలో సుల్తాన్ పూర్. దాయర గ్రామాలకు నిధులు కేటాయించాలని సుల్తాన్ పూర్ ఎంపీటీసీ మధురవేణి ఎమ్మెల్యే కు వినతిపత్రం ఇవ్వగా తిరస్కరిస్తూ కిందపడేసి దురుసుగా ప్రవర్తించారని దానికి నిరసనగా శనివారం పటాన్ చెరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్. పట్టణ అధ్యక్షులు నర్సింహారెడ్డిలు మాట్లాడుతూ…. గతంలో పటాన్ చెరు,భానూర్ అలాగే అమీన్ పూర్ మండలాల్లో అనేక గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టి కోర్టు చుట్టూ తింపిన ఘనత టిఆర్ఎస్ పార్టీదని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల పైన అక్రమ కేసులు. దాడులు. గ్రామ సర్పంచులకు. ఎంపిటిసిల కు నిధుల కేటాయింపుల్లో వివక్షకు నిరసనగా ఈ నెల 7న బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి. డిసిసి కార్యదర్శి సామయ్య. జెడ్పిటిసి ఇంచార్జి రాధా కృష్ణ శర్మ. పీటర్ కృష్ణ. దేవాదినం. రాజు. ప్రతాప్ కృష్ణ. శీను తదితరులు పాల్గొన్నారు.