Hyderabad

గీతం స్కాలర్ కల్పన దీవికి డాక్టరేట్

పటాన్‌చెరు:

పెరోవ్ స్కెట్, డై – సెన్సిటెజెతడ్ సౌర ఘటాల కోసం శక్తిని నింపే రవాణా పరికరాల అభివృద్ధిపై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన పటాన్‌చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి కల్పన దీవి ని డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని భౌతికశాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఐవీ సుబ్బారెడ్డి బుధవారం వెల్లడించారు. వివిధ సౌర ఘటాల సాంకేతికతలలో పాల్గొన్న శక్తిని నింపే రవాణా సామగ్రికి సంబంధించిన సవాళ్ళను పరిష్కరించడం ఈ సిద్ధాంత వ్యాసం యొక్క లక్ష్యంగా ఆయన తెలిపారు. ఈ పరిశోధన ద్వారా డై సెన్సిటెజెతడ్ సౌర ఘటాలకు ప్రత్యామ్నాయాలను రూపొందించామన్నారు. కల్పన సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్‌డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీవి రామారావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు పేర్కొన్నారు.

గీతంలో ఎన్ సీసీ క్యాంపు

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్, ఎన్ సీసీ 33 తెలంగాణ బెటాలియన్, సంగారెడ్డి ఆధ్వర్యంలో పది రోజుల సంయుక్త వార్షిక శిక్షణా శిబిరం (సీఏటీసీ) ని ఈనెల 6 నుంచి 15 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పలు కళాశాలలు, పాఠశాలలకు చెందిన దాదాపు 450 మంది విద్యార్థులు ఈ క్యాంపులో పాల్గొననున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాటు చేసిన ఈ క్యాంపులో పాల్గొనే క్యాడెట్లకు ఆయుధ శిక్షణ, డ్రిల్, ఫెర్డింగ్, న్యూస్ రీడింగ్, వ్యక్తిత్వ వికాసం, జీవనశైలి వ్యాధులపై అవగాహన వంటి వాటిపై శిక్షణ ఇవ్వనున్నారు.

ఇక చదవండి

సామాన్యుడిపై మరో భారం.. పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర

అధిక వడ్డిలు వసూలు చేస్తే నేరుగా సమాచారం ఇవ్వండి : డిఐజి రంగనాధ్

 

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago