_తరంగణి మేళాలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడి కేంద్రాలు పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యారంగంలో మెలుకువలు నేర్పిస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఐసిడిఎస్ మరియు అజీజ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడి ఉపాధ్యాయుల కోసం పటాన్చెరు పట్టణంలోని అంగన్వాడి కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పూర్వ ప్రాథమిక విద్య తరంగణి టీచర్స్ మీలాలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఏర్పాటు చేసిన నృత్య రూపకాలు, కథలు చెప్పడం, అక్షరాస్యత కృత్యాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పూర్వ శిశు విద్యార్థులకు ప్రాథమిక విద్యను అందించడంతోపాటు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం సేవలు అందించడంలో అంగన్వాడీలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ప్రతి సంవత్సరం తరంగిణి కార్యక్రమం పేరుతో అంగన్వాడి ఉపాధ్యాయులకు నూతన విద్యా విధానం మేలుకోవాలని నేర్పించడంలో అజీజ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు పట్ల ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఐసిడిఎస్ జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, సిడిపిఓ చంద్రకళ, పార్టీ గ్రామ సర్పంచ్ మున్నూరు లక్ష్మయ్య, రుద్రారం ఎంపీటీసీ రాజు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, అంగన్వాడి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…