Telangana

ఆగస్టు 29న అమీన్పూర్ వేదికగా పోరుబాట

22A భూముల బాధితులకు అండగా గులాబీ దళం

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు రాక 15 వేల మందితో భారీ నిరసన సభ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

పటాన్‌చెరు నియోజకవర్గంలో 22A నిషేధిత జాబితాలో చేరిన భూములు, ఫ్లాట్స్, ప్లాట్ల బాధితులకు అండగా నిలిచేందుకు గులాబీ దళం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టనుంది.ఈ నేపథ్యంలో ఆగస్టు 29న పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ వేదికగా భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మంగళవారం ఉదయం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో నియోజకవర్గం పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులతో నిరసన కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ 22A భూముల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయనస్పష్టం చేశారు.రెక్కల కష్టంతో పైసా పైసా కూడబెట్టుకొని ఇల్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన పేద మధ్యతరగతి బతుకులను 22A నిషేధిత భూముల పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోడ్డు మీదకు తీసుకుని వచ్చిందని వాపోయారు. నియోజకవర్గం వ్యాప్తంగా 22A జాబితా కారణంగా భూముల విక్రయాలు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు అండగా బిఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తోందని తెలిపారు.

భూమి అనేది ప్రతి కుటుంబానికి అత్యంత విలువైన ఆస్తి అని, సంవత్సరాలుగా తమ భూములను సాగు చేసుకుంటూ, ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్న అనేక కుటుంబాలు 22A జాబితా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ఈ నెల 29, శనివారం అమీన్పూర్ వేదికగా భారీ నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. సుమారు 15 వేల మంది నిరసన సభకు హాజరు కానున్నట్లు తెలిపారు.అర్హత ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పోరాటాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.నిరసన సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, 22A భూముల బాధితులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago