హైదరాబాద్, అక్టోబర్ 2026:
వెండి కళాకృతులు, ఆభరణాలకు ప్రత్యేకత పొందిన ‘అర్జెంటమ్ ఆర్ట్స్ – ది సిల్వర్ స్మిత్’ హైదరాబాద్ కొకాపేట్‌లో ని వంశీరామ్ జ్యోతి ఆప్టిమాలో తమ రెండో స్టోర్‌ను ప్రారంభించింది. ఈ స్టోర్ ప్రారంభోత్సవానికి ప్రముఖ భారతీయ నటుడు, సినీ నిర్మాత మురళీ మోహన్ హాజరయ్యారు.హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సామాజికవేత్తలు, వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు, కళాభిమానులు, ఫ్యాషన్ రంగానికి చెందిన ప్రముఖులు హాజరై సందడి చేశారు. ‘అర్జెంటమ్ ఆర్ట్స్ – ది సిల్వర్ స్మిత్’లో స్వచ్ఛమైన వెండి ఆభరణాలు, దైవ విగ్రహాలు, పూజా సామగ్రి, గృహాలంకరణ వస్తువులు, కళాత్మక కళాఖండాలు, సంప్రదాయ శైలిలో రూపొందించిన ప్రత్యేక వస్తువులు, విలువైన బహుమతుల కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. భారతీయ సంప్రదాయ కళా వైభవాన్ని ఆధునిక అభిరుచులతో మేళవిస్తూ వినియోగదారులకు విభిన్నమైన ఉత్పత్తులను అందిస్తోంది.ఈ సందర్భంగా అవినాష్ గుప్తా మాట్లాడుతూ, “వెండి అనేది సంపద, శ్రేయస్సు, విజయం, అదృష్టానికి ప్రతీక. భారతీయ సంప్రదాయాల్లోనూ వెండికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆధ్యాత్మికంగా కూడా వెండికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ‘అర్జెంటమ్ ఆర్ట్స్ – ది సిల్వర్ స్మిత్’లో రూపొందించే ప్రతి వస్తువులోనూ సంప్రదాయ వారసత్వాన్ని, అత్యుత్తమ నైపుణ్యాన్ని మేళవించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి ఉత్పత్తిని 92.5 స్టెర్లింగ్ సిల్వర్‌తో నాణ్యతకు, సున్నితమైన పనితనానికి, ప్రత్యేకమైన డిజైన్లకు ప్రాధాన్యమిస్తూ రూపొందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అందంగా తీర్చిదిద్దిన దైవ విగ్రహాలు, పూజా సామగ్రి నుంచి ఆకర్షణీయమైన వెండి ఆభరణాలు, గృహాలంకరణ వస్తువులు, ప్రత్యేక బహుమతుల వరకు విస్తృత శ్రేణి కలెక్షన్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని అవినాష్ గుప్తా పేర్కొన్నారు.
రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…
ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…
శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…