Telangana

అమీన్పూర్ ప్రభుత్వ విద్యారంగంలో సరికొత్త అధ్యాయం

రూ.74.50 కోట్లతో క్యూర్ అర్బన్ రీజియన్ పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపన

పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యం

పటాన్‌చెరు ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఆధునిక వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పటాన్‌చెరు నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.అమీన్పూర్ డివిజన్ పరిధిలోని గండిగూడెం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రూ.25 కోట్ల అంచనా వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణం, సుల్తాన్‌పూర్‌లో ఒక ఎకరం 10 గుంటల విస్తీర్ణంలో రూ.49.50 కోట్ల అంచనా వ్యయంతో క్యూర్ అర్బన్ రీజియన్ పాఠశాలలనిర్మాణ పనులకు బుధవారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గంలోని 9 డివిజన్ల పరిధిలో రూ.364 కోట్లతో క్యూర్ అర్బన్ రీజియన్ పాఠశాలలు, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.

కొత్తగా నిర్మించనున్న పాఠశాలల్లో విశాలమైన తరగతి గదులు, ఆధునిక మౌలిక వసతులు, అవసరమైన విద్యా సదుపాయాలతో పాటు నాణ్యమైన బోధన అందించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. తద్వారా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ మెరుగైన విద్యా వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.పటాన్‌చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసి, ప్రతి విద్యార్థికి సమానమైన విద్యా అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.క్యూర్ అర్బన్ రీజియన్ పాఠశాలల నిర్మాణంతో పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మౌలిక వసతుల పరంగా గణనీయమైన విస్తరణకు అవకాశం ఏర్పడనుంది.

భవిష్యత్ తరాలకు మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించే దిశగా ఈ నిర్మాణ పనులు కీలకంగా నిలవనున్నాయి.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మాజీ ప్రజా ప్రతినిధులు రాజు, భాస్కర్ గౌడ్, అమీన్పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, TGEWIDC ఈఈ శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ సుధాకర్, డిఈలు రాజు, వెంకటరమణ, ఏఈ వరుణ్ రెడ్డి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

14 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

17 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

19 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

19 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

19 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago