Telangana

ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మినీ స్టేడియం, పార్కులు ఏర్పాటు చేయాలి నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్

​మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజా ప్రయోజనాల కొరకు మినీ స్టేడియం, పార్కులను ఏర్పాటు చేయాలని, నానాటికీ పెరిగిపోతున్న ప్రభుత్వ రోడ్ల ఆక్రమణలను అడ్డుకోవాలని, అలాగే తీవ్ర గందరగోళంగా మారిన కొత్త ఇండ్ల నంబర్ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు , తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు.  ఆయన మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ వెంకట కిషన్ రావును కలిసి  ఒక సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు.​ఈ సందర్భంగా మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీ శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ, స్థానిక యువతకు మరియు విద్యార్థులకు క్రీడల్లో రాణించడానికి, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి కనీసం ఒక్క ఆట స్థలం లేదా మినీ స్టేడియం కూడా లేకపోవడం విచారకరమన్నారు. అదేవిధంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు సాయంత్రం వేళల్లో మానసిక ఉల్లాసం కొరకు గడపడానికి, వ్యాయామం చేయడానికి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి వెంటనే పార్కులను ఏర్పాటు చేయాలని కోరారు.​మున్సిపాలిటీలో ఇంటి నెంబర్ల సమస్య వల్ల స్థానిక ప్రజలు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, కరెంట్ కనెక్షన్లు మరియు వివిధ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని మండిపడ్డారు. ఈ ఇండ్ల నంబర్ల సమస్యను మున్సిపల్ రెవెన్యూ విభాగం తక్షణమే సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు.మరోవైపు మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలలో కొంతమంది వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా ప్రభుత్వ రోడ్లను, ఖాళీ స్థలాలను ఆక్రమించి అక్రమంగా భవన నిర్మాణాలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల రోడ్లు ఇరుకుగా మారి తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం ప్రకారం అధికారులు స్పందించి, తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి రోడ్లపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago