Telangana

పటాన్‌చెరులో ఓట్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరపాలి: సంగారెడ్డి జిల్లా ఐఎన్ టీయూసి పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్కూరి నరసింహారెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్‌చెరు నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఓటర్ల జాబితాలో అక్రమంగా ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్ల నమోదు పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని, దీనిపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఐఎన్ టీయూసి పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్కూరి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రోజున నాయకులతో కలిసి ఆయన తహసీల్దార్ గారికి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కొల్కూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాలరాసే విధంగా ఓట్ల చోరీ జరుగుతోందని మండిపడ్డారు. ఇప్పటికే నియోజకవర్గంలో 30 శాతానికి పైగా, అంటే సుమారు 90 వేల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిన ఈ అక్రమాలపై రెవెన్యూ యంత్రాంగం తక్షణమే స్పందించాలని కోరారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే పరిశీలించాలని, పారదర్శక విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల నమ్మకాన్ని కాపాడే బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి ,మాజీ పీసీసీ కార్యదర్శి మతీన్, కాంగ్రెస్ నాయకులు చంద్రయ్య, జంగయ్య, ఐఎన్ టీయూసి నాయకులు సుబ్బయ్య ,మధుసూదన్ రెడ్డి, మహేందర్, రాములు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

14 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

18 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

20 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

20 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

20 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago