పరిమళించిన మానవత్వం…

Hyderabad

పరిమళించిన మానవత్వం…
– కాలిబాటన వెళ్తున్న వృద్ధులకు వాహనం ఏర్పాటు
– మహేష్ పాటిల్ ను అభినందించిన స్థానికులు

హైదరాబాద్:

లాక్ డౌన్ కారణంగా రవాణా సౌకర్యం లేక ఇద్దరు వృద్ధులు కాలిబాటన నడుచుకుంటూ వెళ్తుంటే ఇది గమనించిన టిఆర్ఎస్ కెవి రాష్ట్ర నాయకులు మహేష్ పాటిల్ వారికి వాహనం ఏర్పాటు చేసి గ్రామానికి పంపించారు… వివరాల్లోకి వెళితే..
బీదర్ నుండి ఓ వృద్ధ దంపతులు ఆటోలో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం కు ఆదివారం ఉదయం చేరుకున్నారు. అప్పటికి సమయం పది దాటడంతో లాక్ డౌన్ కారణంగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఇద్దరు వృద్ధులు నడుచుకుంటూ మిర్జాపూర్ కు చేరుకున్నారు. ఇది గమనించిన టిఆర్ఎస్ కేవి రాష్ట్ర నాయకులు బగ్గీ మహేష్ పాటిల్ స్థానికంగా ఉన్న క్యాబ్ డ్రైవర్ సుమన్, మరో వ్యక్తి కృష్ణ తో మాట్లాడి నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు వృద్ధులను వారి గ్రామం పంపాడు లో వదిలి రావాలని చెప్పి, నగదు ఇచ్చి పంపించారు. ఇది గమనించిన స్థానికులు మహేష్ పాటను అభినందించారు. అదేవిధంగా వృద్ధ దంపతులు మహేష్ పటేల్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మహేష్ పాటిల్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి చేసేందుకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని పోలీసు శాఖకు ఆదేశిస్తూ ఉంటే, వారికి ప్రజలు సహకరించాలని, అలాకాకుండా ఇష్టారాజ్యంగా రోడ్ల పై తిరుగుతే కేసు నమోదు అవుతాయి అన్నారు. అత్యవసరమైతేనే బయటకు డబుల్ మాస్కులు ధరించి బయటకు రావాలన్నారు. అనంతరం ఆ వృద్ద దంపతులకు నచ్చజెప్పి కారులో వారి గ్రామానికి పంపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *