గీతం స్కాలర్ రమాదేవికి డాక్టరేట్….

Hyderabad

గీతం స్కాలర్ రమాదేవికి డాక్టరేట్….

హైదరాబాద్:

సవరించిన ఏరియా జనరేషన్ టెక్నిక్ తో సమర్థవంతమైన చిత్రాన్ని ఆవిష్కరించడంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం పరిశోధక విద్యార్థిని వి.రమాదేవిని డాక్టరేట్ వరించింది.

ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ కె.మంజునాథాచారి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . ఈ పరిశోధనలో వేద గణితాలను ఉపయోగించి సవరించిన ఏరియో జనరేషన్ టెక్నిక్ స్కేలర్ తో సమర్థవంతమైన ఇమేజ్ స్కేలింగ్ ప్రాసెసర్ తక్కువ మెమరీ అవసరాలు , అధిక నాణ్యత , అధిక పనితీరుతో రియల్ టైమ్ ఇమేజ్ మెరుగుదల అనువర్తనాల కోసం తక్కువ ఖర్చుతో , తక్కువ శక్తి గల వీఎన్ఎస్ఏ సర్క్యూట్ను రూపొందించడానికి ప్రతిపాదించినట్టు ప్రొఫెసర్ మంజునాథాచారి వివరించారు . ప్రతిపాదిత రూపకల్పనలో చిత్ర నాణ్యతను అభివృద్ధి చేయడానికి సమర్థవంతమైన ఎడ్జ్ క్యాప్చర్ టెక్నిక్ , తక్కువ సంక్లిష్టతతో పదునైన ఫిల్టర్ ఉపయోగించినట్టు ఆయన తెలిపారు . గణన సంక్లిష్టతను , ప్రతిపాదిత రూపకల్పన హార్డ్ వేర్ ఖర్చులను తగ్గించడానికి వేద గణితం ఉపయోగించామని , రౌండింగ్ లోపం దిద్దుబాటు పద్ధతులను ఉపయోగించకుండా ఈ పద్ధతి అమలు చేస్తారన్నారు . రమాదేవి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ . స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , వివిధ విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .