ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం…

Crime

ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం…

పటాన్ చెరు:

ఇంటి నుండి బయటకు వెళ్లి ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… పటాన్ చెరు మండలం నందిగామ గ్రామానికి చెందిన మనోహర్ ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లిన మనోహర్ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద , బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించని లేదని కుటుంబ సభ్యులు బీడీఎల్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. మనోహర్ కుమారుడు గాండ్ల వీరేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *