అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త…
పటాన్ చెరు:
ఇతరులతో ఫోన్ లో మాట్లాడుతుందని అనుమానంతో ఓ భర్త భార్యను తలపై సుత్తితో కొట్టి హత్య చేసిన సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.సిఐ వేణు గోపాల్ రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి… పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన మేకవేల్ రాయి కొట్టే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా తన భార్య రాజేశ్వరి ఇతరులతో ఫోన్ మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్న మేక వేల్ తరచూ భార్య తో గొడవ పడుతూ ఉండేవాడు.
ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన భార్య భర్తలు ఇద్దరు గొడవ పడడం తో కుటుంబ సభ్యులు ఇద్దరికీ సర్ది చెప్పారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మేకవేల్ తను రాయ్ కొట్టేందుకు ఉపయోగించే సుత్తితో బుధవారం ఉదయం భార్య తలపై కొట్టగా, రాజేశ్వరి పెద్దగా అరిచింది, దీంతో ఇంటి నుండి భర్త పరారయ్యాడు. కొన ఊపిరితో ఉన్న రాజేశ్వరిని కుటుంబ సభ్యులు పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.