ప్రమాదానికి గురైన మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌…

Hyderabad

ప్రమాదానికి గురైన మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌…
– తప్పిన ప్రమాదం

హైదరాబాద్:

సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్ రావు కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. జిల్లాలోని దుద్దెడ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, అద్రుష్టవశాత్తు మంత్రి హరీశ్ రావు క్షేమంగానే ఉన్నారు. ప్రమాదానికి గురైన కారు డ్రైవర్, గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న కాన్వాయ్‌కు అడ్డంగా సడెన్‌గా అడవి పందులు అడ్డుగా రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా ఉన్న కారు ఆగిపోవడంతో ఆ వాహానాన్ని మంత్రి హరీశ్ రావు కారు ఢీకొంది.

Telangana Min Harish Rao's convoy meets with accident, no one hurt | The News Minute

ఓ అడవిపంది ఉన్నట్టుండి సడన్ గా రోడ్డుపైకి రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ అప్లై చేశారు. దాంతో కాన్వాయ్ లోని మిగతా వాహనాల డ్రైవర్ లు కూడా సడెన్ బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్నా వాహనాలు ఒకదానికి ప్రమాదానికి గురైయ్యాయి. . దాంతో కాన్వాయ్ లో వెనుకగా వస్తున్న ఇతర వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మంత్రి హరీశ్ రావు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అనంతరం కాన్వాయ్ తిరిగి హైదరాబాద్ బయల్దేరింది. నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధిపేటలో పర్యటించిన నేపథ్యంలో, ఆర్థికమంత్రి హరీశ్ రావు కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరిగి హైదరాబా వెళ్లుతున్నడగా ఈ ఘటన చోటు చేసుకున్నది .మంత్రి తో పాటు కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న వారికీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు . దీనితో అందరు ఊపిరి పీల్చుకొని హైదరాబాద్ ప్రయాణమైయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *