హుజురాబాద్ లో కురుక్షేత్రం యుద్ధం జరగబోతుంది….
– ఈటల రాజేందర్
హైదరాబాద్:
హుజురాబాద్లో ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుందని… ఇది కురుక్షేత్రయుద్ధం గా అభివర్ణించారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ .
20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని..
అధికారంలో ఉన్న నాడు,లేని నాడు ఎప్పుడైనా నాకు ఉన్నంతలో పని చేసి ప్రజల మెప్పు పొందాని ఈటల అన్నారు.నియోజకవర్గ ప్రజలు
బిడ్డ మా ఇళ్లలో భర్తలు చనిపోయిన వాళ్ల పెన్షన్ లు పెండింగ్ లో ఉన్నాయని..పెళ్ళిళ్ళు జరిగి రెండు సంవత్సరాలు గడిచినా కళ్యాణ లక్ష్మీ పథకం కింద చెక్కులు రావడం లేదంటున్నారు.
కొత్త పెన్షన్ లు ,రేషన్ కార్డ్ లు వెంటనే ఇప్పియ్యలని ముఖ్య మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నారు.
తాను గాలికి గెలువ లేదని…ప్రజలు నన్ను నమ్మి వోట్ వేస్తే గెలిచానని చెప్పుకొచ్చారు. ఎం.పి.ఎన్నికల్లో 50 వేల పై చిలుకు మెజారిటీ నన్ను చూసి ఇచ్చారని గుర్తు చేశారు.తాను
ఏనాడు వేరే పార్టీ పెడుత అని చెప్పలేదని…మీరే నన్ను బహిష్కరించారని చెప్పారు.మీరు తోడుకున్న బొందలో మీ ప్రభుత్వమే పడ్తుందని ఈటల అన్నారు.ఈటెల గెలుపు అంటే ఆత్మ గౌరవం గెలుపన్నారు.
నా లాంటి వాడు మాట్లాడితే నే మీకు తెలుస్తుంది.ధాన్యం ప్రభుత్వం కొంటుంది అని చెప్పిన దాంట్లో తప్పేంటని ప్రశ్నించారు.కొంత మంది చెంచా గాలతో నా మీద కరపత్రాలు కొట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
2018 ఎన్నికల్లో నా ప్రత్యర్థి కి డబ్బులు ఇచ్చి నన్ను ఓడ గొట్టే ప్రయత్నం చేశారని..అన్ని బరించానని….అది నా సహనం తప్ప భయం కాదన్నారు. నా నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని తెలిపారు.
ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం జరుగ బోతుందని
..ధర్మానికి అధర్మానికి జరుగబోయే యుద్ధం అని ఈటల అన్నారు.ఈ యుద్ధం లో విజయం హుజూరాబాద్ ప్రజలదన్నారు.
ప్రజాస్వామికంగా గెలిచే ప్రయత్నం చెయ్యండి దొంగ దారిన గెలిచే ప్రయత్నం చేస్తే మా ప్రజలు ఊరుకోరన్నారు.
