శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఏర్పాట్లు పూర్తి

– అక్టోబ‌రు 11, 12వ తేదీల్లో ముఖ్య‌మంత్రితో ప‌లు ప్రారంభోత్స‌వాలు   – వెనుకబడిన పేద వర్గాల భక్తులకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం తిరుమ‌ల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబ‌రు 7 నుండి 15వ తేదీ వ‌ర‌కు ఏకాంతంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి గారు తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో బుధ‌వారం సాయంత్రం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ గారు మాట్లాడుతూ అక్టోబరు 7వ తేదీ […]

Continue Reading

 బతుకమ్మ వేడుకలకు హాజరైన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…

పటాన్‌చెరు: తెలంగాణ ఆడబిడ్డల ప్రత్యేక పండగ బతుకమ్మ సంబరాలు నేటి నుండి మొదలవడంతో పటాన్చెరు పట్టణంలోని వీధులన్నీ బతుకమ్మ ఆటపాటలతో పండుగ వాతావరణం సంతరించుకున్నాయి. గొనెమ్మ బస్తీలోని గొనెమ్మ ఆలయం మరియు జేపీ కాలనీ లోని గుడి వద్ద జరిగిన బతుకమ్మ సంబరాలలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు హాజరవడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మొదలవడంతో పట్టణం లోని వీధులన్నీ ఆడబిడ్డల ఆటపాటలతో నూతన కల సంతరించుకున్నాయని అన్నారు. […]

Continue Reading

నేడు బద్వేల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమలమ్మ నామినేషన్

విజయవాడ : బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ శాసన సభ్యురాలు పి.ఎమ్ కమలమ్మ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కమలమ్మను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 10గంటలకు బద్వేలు లో నామినేషన్ దాఖలు. కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.సాకే శైలజనాథ్ మరియు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొంటారు.

Continue Reading

స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ సహాయం వికలాంగుల ట్రై సైకిల్

రాజమండ్రి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం పొట్టిలంక గ్రామం కు చెందిన అంకం వీరబాబు అనే వికలాంగుడు గత నెలలో రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ గారు పొట్టిలంక గ్రామ పర్యటనలో ఉండగా అంకం వీరబాబు చందన నాగేశ్వర్ గారిని కలిసి తనకు వికలాంగుల ట్రై సైకిల్ కావాలి అని కోరారు. దానికి స్పందించిన చందన నాగేశ్వర్ గారు ఈ రోజు వారి పార్టీ కార్యాలయంలో అంకం […]

Continue Reading

ఉపాధ్యాయురాలి పై చర్యలు తీసుకోవాలని DEO గారికి వినతి :SFI జిల్లా సహాయ కార్యదర్శి

  కడప కడప జిల్లా పోరుమామిళ్ల మండలం చిన్న కప్పల పల్లె గ్రామానికి చెందిన ఆర్. సి. యం ఎయిడెడ్ ఎంపీపీ పాఠశాల లో పనిచేయుచున్న ఉపాధ్యాయురాలు కృష్ణ కుమారి గారు పాఠశాలకు సమయానికి రాకుండా ఇష్టం వచ్చినట్టు మధ్యాహ్న భోజన పథకం ప్రకారం పెట్టకుండా ఇష్టానుసారంగా పెడుతూ విద్యార్థులకు నష్టం కలిగిస్తున్నారు. పాఠశాలకు వచ్చి విద్యార్థులకు చదువు చెప్పకుండా పక్కనే ఉన్నా రేకుల షెడ్ లో నిద్రిస్తూ ఇంటికి వెళ్ళే సమయం కాకుండానే ఇంటికి వెళుతూ […]

Continue Reading

దుర్గమ్మ విద్యుత్ దీపాలు కు తప్పని పార్టీ రంగులు..

విజయవాడ ఏమిటో ఈ రంగుల గోల.. నిన్న బడి,కనపడిన ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి వైసీపీ పార్టీ జెండా రంగులు వేసేశారు..చివరకు హైకోర్టు అక్షింతలతో కొన్ని కార్యాలయాలకు రంగులు తొలగించారు.మరి కొన్ని ఇంకా అలాగే ఉన్నాయి.ఇప్పుడు దేముడి గుడిని కూడా వదలడం లేదు.బులుగు,ఆకుపచ్చ బల్బులతో బెజవాడ దుర్గమ్మ ఆలయాన్ని విద్యుత్ బల్బులతో అలకరించేశారు..ఎవరు ఇచ్చారో ఈ ఐడియా కానీ రాత్రి వేళ అమ్మవారి ప్రధాన ఆలయం చుట్టూ వైసీపీ పార్టీ జెండా రంగులే కనపడుతున్నాయి. ఇలాంటి సంస్కృతి తీసుకురావడం […]

Continue Reading

గీతం స్కాలర్ కల్పన దీవికి డాక్టరేట్

పటాన్‌చెరు: పెరోవ్ స్కెట్, డై – సెన్సిటెజెతడ్ సౌర ఘటాల కోసం శక్తిని నింపే రవాణా పరికరాల అభివృద్ధిపై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన పటాన్‌చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి కల్పన దీవి ని డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని భౌతికశాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఐవీ సుబ్బారెడ్డి బుధవారం వెల్లడించారు. వివిధ సౌర ఘటాల సాంకేతికతలలో […]

Continue Reading

సామాన్యుడిపై మరో భారం.. పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర

 ఈ రోజు నుంచే అమల్లోకి పండుగ వేళ సామాన్యుడికి గట్టి షాక్ తగిలింది.  దేశంలో వంట గ్యాస్ ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధ‌ర‌లతో సిలిండ‌ర్ల ధ‌ర‌లు ఆకాశానికి చేరుతున్నాయి. ఆయిల్ కంపెనీలు ఎల్‌‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ ధరను రూ.15 మేర పెంచాయి. ఇవాళ్టి నుంచే కొత్త ధ‌ర‌లు అమ‌లులోకి రానున్నాయి. ఢిల్లీలో నాన్‌ సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.899.50చేరింది. కాగా […]

Continue Reading

అమీన్పూర్ లో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ ప్రపంచంలో పూల ను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ అని, ఆ పండుగ రోజున మహిళలు అందరూ సంతోషంతో ఉండాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిఏటా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా […]

Continue Reading

జిన్నారం మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ ప్రవీణ్ గౌడ్ కు ఘన నివాళులు

జిన్నారం జిన్నారం మండలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన జర్నలిస్ట్ ప్రవీణ్ గౌడ్ కి సంతాపం తెలిపారు .ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి,రెండు నిమిషాలు మౌనం పాటించారు .అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆనంద్ మాట్లాడుతూ జర్నలిస్ట్ లకు ఇటీవల కాలంలో ఆర్ధిక ఇబ్బందులు అధికమాయ్యాయని అన్నారు. యాజమాన్యాలు సైతం గ్రామీణ విలేకరుల ను వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి గ్రామీణ విలేకరుల సమస్యలపై కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. […]

Continue Reading